Header Banner

మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారా? తుది గడువు ముగుస్తోంది..! రాత పరీక్షలు ఎప్పట్నుంచంటే?

  Tue May 06, 2025 16:10        Employment

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16 వేలకు పైగా ఉపాధ్యాయ కొలువుల భర్తీకి గత నెలలో మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే ముగియనుంది. మే 15వ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. మరోవైపు జూన్‌ 6 నుంచి ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వెలువడిన అతి పెద్ద డీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇదే కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు పోస్టులకు పోటీపడనున్నారు. మొత్తం 16,347 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనున్నారు. 1994 నుంచి 2018 వరకు తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో స్పెషల్, లిమిటెడ్‌ రిక్రూట్‌మెంట్లతో కలిపి మొత్తం 13 డీఎస్సీల ద్వారా ఏకంగా 1.8 లక్షల మంది ఉపాధ్యాయుల నియామకాలను పూర్తి చేశారు. ఏపీలో చివరిగా 2018లో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఆ తర్వాత ఒక్క నోటిఫికేషన్‌ కూడా వెలువడక పోవడంతో దాదాపు ఏడేళ్లుగా అభ్యర్థులు నోటిఫికేషన్‌ కోసం పడిగాపులు కాశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించేందుకు గతేడాది అక్టోబరులో టెట్‌ కూడా నిర్వహించింది. ఇక 2024 నవంబరులోనే డీఎస్సీ సిలబస్‌ కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే డీఎస్సీ ప్రకటన జారీ చేయవల్సి ఉండగా.. ఎస్సీ ఉపవర్గీకరణ అమలు నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలలో జాప్యం నెలకొంది. ఎస్సీ వర్గీకరణ గత నెలలో పూర్తి కావడంతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అలాగే స్పోర్ట్స్‌ కోటాను 3 శాతానికి పెంచడమే కాకుండా 421 పోస్టులకు తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేశారు.

మొత్తం పోస్టుల్లో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు, రాష్ట్ర, జోనల్‌ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్‌ సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలకు జిల్లా స్థాయిలో నియామకాలు చేపట్టనున్నారు. అన్ని రకాల ఎస్జీటీ పోస్టులు 6,599 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు 7,487 పోస్టులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 14,088 పోస్టులు ఉన్నాయి. ఇక రాష్ట్ర స్థాయి పోస్టులు 259 ఉన్నాయి. జోన్‌ 1లో 400, జోన్‌ 2లో 348, జోన్‌ 3లో 570, జోన్‌ 4లో 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో మొత్తం 13,192 ఖాళీలు ఉన్నాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881, జువెనైల్‌ పాఠశాలల్లో 15, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: విదేశీ పర్యటనలో ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్రగాయం! హుటాహుటిన హైదరాబాద్‌కు తరలింపు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #MegaDSC2025 #APDSC #TeacherRecruitment #APJobs #DSCDeadline #EducationNews #AndhraPradeshJobs